మనలో చాలామందికి సినిమా వస్తే వెంటనే చూడాలి అనే ఉత్సాహం ఉంటుంది. OTT లో లేదా theatres లో చూడలేకపోతే, ఇంటర్నెట్‌లో “free movie” కోసం వెతికే వాళ్లు కూడా ఉంటారు. అలాంటి సమయంలో చాలా మంది iBomma అనే పేరుని వింటుంటారు. కానీ ఈ site అసలు ఏంటి, ఎందుకు ఉపయోగించకూడదు, users కి ఏలాంటి ప్రమాదాలు ఉంటాయి అన్నది చాలామందికి తెలియదు. అందుకే ఈ article పూర్తిగా awareness కోసం మాత్రమే, ఎలాంటి అక్రమ కార్యకలాపాలను ప్రోత్సహించదు. iBomma ఎంత ప్రమాదమో ఈ article తో తెలుసుకుంటారు.
iBomma అంటే ఏమిటి?
iBomma అనేది Telugu సినిమాలు, web series లాంటి contentను అక్రమంగా upload చేసే piracy website. సినిమా theatre లేదా OTT లో రాగానే, కొన్ని గంటల్లోనే ఈ site లో లీక్స్ కనిపిస్తాయి. ఇది ఒక్క industry కి మాత్రమే కాదు, మొత్తం filmmaking ecosystem కి నేరుగా నష్టం కలిగించే పని. కానీ అందరూ ఫ్రీ గా వచ్చే movies కి ప్రాధాన్యత ఇస్తారు కానీ ఆ ఫ్రీ వెనుక ఉన్న ప్రమాదాన్ని ఎవరు కూడా అస్సలు పట్టించుకోరు.
Original creators permission లేకుండా సినిమాలు upload చేయడం భారతదేశ Copyright Act కి పూర్తిగా వ్యతిరేకం. అందుకే ఇది illegal గా గుర్తించబడింది. ఇది చట్టరీత్యా నేరం.
iBomma ఎందుకు ప్రమాదకరం?
1️⃣ మీ personal data కి పెద్ద ప్రమాదం
ఇలాంటి sites లో కనిపించే ads చాలా dangerous.
మీరు ఉపయోగించే సమయంలో:
- Mobile లో virus install అవ్వచ్చు
- మీ photos, contacts లేదా files leak అవ్వచ్చు
- Banking details వరకు దొంగిలించే chance ఉంటుంది
- Browser లో unwanted redirects వస్తాయి
Free movie కోసం వెళ్లి, personal data ను ప్రమాదంలో పెట్టడం worth కాదు. ఇదంతా మనకి మూవీ చూస్తున్నప్పుడు మనకు తెలియకుండా Background లో డేటా అంతా వాళ్ళకి డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది ఆ విషయం మనకు తెలియదు నువ్వే చూస్తున్నంత సేపు. మీకు తెలియని విషయం ఏమిటంటే మన డేటాని వాళ్ళు వేరే వాళ్లకు అమ్ముకొంటారు. అది మన పర్సనల్ డేటా కావచ్చు బ్యాంకింగ్ డేటా కావచ్చు లాగిన్ డీటెయిల్స్ కావచ్చు ఇంకేమైనా కావచ్చు. ఇలాంటి వెబ్సైట్లు వాడుతున్నామంటే మన ప్రమాదాన్ని మనమే కోరి తెచ్చుకున్నట్టే.
2️⃣ Legal సమస్యలు కూడా రావచ్చు
కొంతమందికి తెలుసు కూడా కాదు—piracy websites ను ఉపయోగించడం కూడా punishable.
Indian law ప్రకారం:
- Fines
- Cyber complaints
- Even imprisonment వరకు వెళ్లే అవకాశం ఉంటుంది
So “just downloading” అనుకున్నది serious legal trouble అవ్వొచ్చు. కాబట్టి ఇలాంటి వెబ్సైట్స్ తో జాగ్రత్తగా ఉండండి. ఇంటర్నెట్లో మనకి తెలియని వెబ్సైట్లు ఎక్కువగా ఉపయోగించకూడదు.
3️⃣ Fake websites వల్ల scams
iBomma పేరుతో fake sites చాలా వస్తాయి. ఇవి ఇంకా ప్రమాదకరం. ఇలాంటి వెబ్సైట్లు ఓపెన్ చేసినప్పుడు వేరే వెబ్సైట్లో కూడా ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంటాయి అక్కడ మనకి ఆకర్షించే ఆఫర్లు ఉంటాయి ఆఫర్ పైకి చేసి మనం ఏదైనా ఫైనాన్షియల్ రాన్జేషన్స్ చేస్తే మన బ్యాంక్ అకౌంట్ హ్యాక్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మన పాస్వర్డ్ లో క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు వంటి వాటి సెన్సిటివ్ డేటా వాళ్లకి ట్రాన్స్ఫర్ అవుతుంది మనం అక్కడ ఎటువంటి పేమెంట్లు చేయకూడదు.
వాటిలో:
- Fake recharge offers
- UPI payment fraud
- OTP scams
- Fake app downloads
వంటి traps ఎక్కువగా ఉంటాయి. మనకు తెలియని వెబ్సైట్లో పేమెంట్లు చేస్తున్నామంటే మన అకౌంట్లో మనీ మనమే ఖాళీ చేస్తున్నామని మనమే అర్థం చేసుకోవాలి.
Safe & Legal Alternatives (Better Quality + Zero Risk)
సినిమాలు చూడటానికి ఇప్పుడు అనేక OTT platforms ఉన్నాయి:
- Amazon Prime Video
- Disney+ Hotstar
- Netflix
- Aha Telugu
- Zee5
- Sony LIV
ఇవి legal, virus-free, safe మరియు మంచి quality ఇస్తాయి.
Creators కి support కూడా అవుతుంది. ఈ వెబ్సైట్లో సబ్స్క్రిప్షన్ చార్జెస్ ఎక్కువ ఉన్నప్పటికీ తక్కువ ఛార్జెస్ ఉన్న ప్లాన్స్ ఎంచుకోవడం మంచిది. జియో లాంటి నెట్వర్క్ మన మొబైల్ రీఛార్జ్ తోనే జియో హాట్ స్టార్ వంటి ప్లాన్స్ ని ఉచితంగా ఇస్తున్నాయి మనం దాన్ని ఉపయోగించుకోవాలి.
ముగింపులో
iBomma వంటి piracy sites మనకు తాత్కాలికంగా “free movie” feeling ఇస్తాయేమో కానీ దాని వెనుక:
- Legal issues
- Data theft
- Viruses
- Scams
వంటి పెద్ద సమస్యలు దాగి ఉంటాయి.
అందుకే మీ mobile, మీ data మరియు మీ online safety కోసం ఎప్పుడూ legal OTT platforms నే ఉపయోగించడం మంచిది. లీగల్ కానీ వెబ్సైట్లను వీక్షించడం అస్సలు మంచిది కాదు. చాలామంది థయేటర్లో టికెట్ ప్రైస్ ఎక్కువగా ఉందని ఇలాంటి వెబ్ సైట్లను ఎంచుకుంటారు, కానీ కొన్ని రోజుల వరకు మాత్రమే టికెట్ ప్రైస్ ఎక్కువగా ఉంటుంది మీరు ఆ సినిమాలను చూడాలి అనుకుంటే 15 రోజులు తర్వాత చూస్తే మనకి తగ్గే టికెట్ ప్రైస్ లతో సినిమా మొత్తాన్ని మనం చూడొచ్చు అనే విషయం మర్చిపోకండి, ఇలాంటి వెబ్సైట్లో జోలికి అసలు వెళ్ళకండి.
ఈ article ఉద్దేశ్యం పూర్తిగా awareness మరియు user safety మాత్రమే. అంటే ఉపయోగపడే ఆర్టికల్స్ కోసం మా వెబ్సైట్ను వీక్షించండి.









1 thought on “iBomma అంటే ఏమిటి? ఎందుకు ప్రమాదకరం? Safe Alternatives (తెలుగు)”