Please Unblock challenges.cloudflare.com to Proceed” – ఇది ఏంటి రా అసలు? Simple గా చెబుతా!

ఈ మధ్య చాలామంది phone లో, laptop లో ఒక వింత error చూసారు:
“Please unblock challenges.cloudflare.com to proceed.”

ChatGPT, Twitter (X), Spotify, Perplexity — ఇవన్నీ ఓపెన్ చేయాలంటే కూడా ఇదే error తిప్పలు పెట్టింది.
Friends కూడా అడిగారు, “రా ఇది ఏం పరిస్థితి? నా net aa bad?” అని. చాలామంది ఎక్కువగా ఇబ్బంది కూడా పడ్డారు. ఎందుకంటే ఈ ఎర్రర్ ఎందుకు వస్తుందో వాళ్లకు కూడా అసలు అర్థం కాలేదు.

అందుకే ఇక ఒకసారి క్లియర్‌గా, మన language లో చెప్పేస్తా.


Cloudflare అంటే ఏంటో ముందుగా తెలుసుకోండి

Cloudflare అనే company basically internet ki bodyguard లాంటిది. అంటే సైబర్ అటాచ్ నుండి ఇది మన సిస్టం ని కాపాడుతుంది.
ఎంతో మంది hackers attacks try చేస్తుంటారు కదా?
వాటినుంచి websites ని save చేస్తుంది.

అదే కాకుండా:

  • Site speed పెంచుతుంది
  • Bots నుండి protect చేస్తుంది
  • మనం human అని prove చేయడానికి చిన్న challenge చూపిస్తుంది

ఆ challenge page addressే
challenges.cloudflare.com ఇది కొన్ని రోజులుగా ఇంటర్నెట్లో ట్రెండింగ్ చేస్తుంది.


అలాగే… ఈ error ఎందుకు వచ్చిందంటే?

1️⃣ Ad-blocker / VPN వల్ల Cloudflare script block అవుతుంది

మీ browser లో ad-blocker లేదా VPN ఉంటే Cloudflare challenge load కాదు.
అప్పుడు site “Unblock chey bro” అన్నట్టు ఈ message ఇస్తుంది. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుందని చాలామందికి అర్థం కాలేదు. ఇది గత రెండు రోజులుగా ఎదుర్కొంటున్న సమస్య.

2️⃣ DNS లేదా network filtering వల్ల

కొన్నిసార్లు మీ WiFi / SIM internetలోనే Cloudflare script block అవుతుంది. అలాంటప్పుడు కూడా ఇలాంటి Error వస్తుంది. అది మీరు గమనించాలి.

3️⃣ అసలు main reason – Cloudflare outage

ఇటీవల Cloudflare వాళ్ల వైపు ఒక internal glitch వచ్చింది.
అందుకే ప్రపంచంలో పెద్ద పెద్ద sites కూడా “down” అయ్యాయి. కొన్ని sites crash అయ్యాయి, అసలు ఏం జరుగుతుందో కూడా వాళ్లకి అర్థం కాలేదు. ఒకటి రెండు కాదు చాలా website లు దీనివల్ల ఇబ్బంది పడ్డాయి.

అంటే ఈసారి తప్పు మీది కాదు… Cloudflare మామ దగ్గర జరిగింది.


ఇప్పుడు దీన్ని ఎలా solve చేయాలి?

Friend-styleగా steps చెబుతున్నా👇

1. Ad-blocker Off చేయి

uBlock, AdGuard, Brave shields—all off చేసి try చేయండి.

2. VPN ఉంటే disconnect చేయి

3. Browser cache clear చేయి

4. DNS మార్చి చూడండి

Google DNS:
8.8.8.8
8.8.4.4

5. Cloudflare down అయితే – just wait

ఈ outage సమయంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా open అయ్యేది కాదు.
Fix అయ్యాకే site open అవుతుంది. కాబట్టి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. కొంత సమయం వేడిచేసి తరువాత మళ్ళీ ప్రయత్నించండి.


Cloudflare down ఉందా తెలుసుకోవాలంటే

  • status.cloudflare.com
  • downdetector.com

ఈ వెబ్సైట్లో ఒక్కరు status check చేయండి. అప్పుడు మీకు ఒక clarity వస్తోంది.


ముగింపు – ఒకసారి settle చేసుకుంటే సరిపోతుంది

ఈ error danger కాదు.
చాలా సార్లు మన browser లోని extensions వల్ల వస్తుంది.
ఈ మధ్య వచ్చినది Cloudflare వాళ్ల side లో problem.

Fix కూడా simple—ad-block off చేయడం, VPN తీసేయడం, DNS మార్చడం.
Cloudflare fix చేస్తే sites మళ్లీ ఆడిపాడుతాయి. కాబట్టి మీ ప్రయత్నం చేసాక fix కాకపోతే కొంత సమయం వేచి అప్పుడు ప్రయత్నించండి.

Also Read : WhatsApp Search by Date Feature – తెలుగు కొత్త అప్డేట్

Leave a Comment