మన ఫోన్ పోతే ఎంత టెన్షన్ వస్తుందో నీకు తెలుసు కదా? ఫోటోలు, WhatsApp, బ్యాంక్ యాప్స్, OTPలు… అన్నీ మన ఫోన్‌లోనే ఉంటాయి. అలాంటప్పుడు ఫోన్ దొంగతనం అయిందంటే మనం ఏం చేస్తాం?
అదే సమస్యను సాల్వ్ చేయడానికి ప్రభుత్వం ఒక సూపర్ యూజ్‌ఫుల్ టూల్ తీసుకొచ్చింది — Sanchar Saathi Portal.
ఇది ఇప్పుడు Google Trends లో కూడా వైరల్ అవుతోంది, ఎందుకంటే చాలా మంది దీన్ని వాడి చూస్తే అసలు ఎంత ఉపయోగపడుతుందో అర్థమవుతోంది. మరి మీరు కూడా తెలుసుకోవాలిగా ఏంటిది ఎలా పనిచేస్తుంది అని.
Sanchar Saathi తో ఏం చేయగలవు?
ఈ portal అసలు ఉద్దేశ్యం, మన దేశంలో mobile security ను మరింత బలంగా చేయడం. ఇదే అసలు ముఖ్య ఉద్దేశం. మనం ఈ యాప్ నీ ఉపయోగించి ఇవి చేయొచ్చు.
ఇక్కడ నువ్వు చేయగలిగినవి:
- నీ lost / stolen mobile ను వెంటనే బ్లాక్ చేయొచ్చు
- Police help తో నీ phone IMEI ని ట్రాక్ చేయొచ్చు
- నీ పేరుతో ఎవరో fake SIM వాడుతున్నారో చెక్ చేయొచ్చు
- ఫోన్ దొరికితే unblock చేసుకోవచ్చు
- నీ పేరుపై మొత్తం ఎన్ని SIM connections ఉన్నాయో కూడా తెలుసుకోవచ్చు
ఈ సర్వీస్‌ను నేరుగా DoT (Department of Telecommunications) నిర్వహిస్తుంది. So 100% safe & official. ఈ website లో మనం మొత్తం వివరాలు తెలుసుకోవచ్చు.
నీ ఫోన్ పోయిందా? ఇలా 5 నిమిషాల్లో బ్లాక్ చేయి
నీకు కావాల్సింది కేవలం ఇవే:
- నీ phone IMEI number
- FIR copy లేదా complaint ID
- నీ ID proof
Sanchar Saathi లోకి వెళ్లి “Block Stolen/Lost Mobile” option ఓపెన్ చెయ్యి → details submit చెయ్యి.
అంతే… నీ phone IMEI దేశంలోని అన్ని networks లో బ్లాక్ అవుతుంది. వారు మీ మొబైల్ ఇక ఉపయోగించలేరు.
👉 దొంగ SIM మార్చినా కూడా mobile ఆన్ కాలేదు.
👉 ఫోన్ resale అయినా కూడా use చేయలేరు.
ఇది నిజంగా చాలా పెద్ద protection రా!. ఇది చాలా మందికి ఉపయోగపడుతోంది.
నీ పేరుతో ఎన్ని SIMలు ఉన్నాయో కూడా చెక్ చేయొచ్చు
Portal లోని TAFCOP అనే sectionలోకి వెళ్లి number enter చేస్తే, నీ పేరుతో ఎవరో ఎక్కువ SIMలు తీసుకుని misuse చేస్తున్నారా అని seconds లో తెలుస్తుంది. అవసరం లేని sim లు Remove చేయొచ్చు. అప్పుడు అవి పనిచేయడం మానేస్తాయి.
అయితే ఈ యాప్ ఎలా install చేయాలి అని చాలామందికి అనిపిస్తుంది. అయితే గవర్నమెంట్ కొత్త నియమం పెట్టింది. ఈ యాప్ నీ ఎవరు uninstall చేయకుండా మొబైల్ అసలు software తోనే వచ్చేలా కొత్త మొబైల్స్ లో ఉండేలా నియమం పెట్టింది. ఇప్పటికే ఉన్న మొబైల్స్ లో update పేరుతో next update లో ఈ యాప్ ని including చేయమని ఆదేశాలు ఇచ్చింది మొబైల్ కంపెనీలకి, ఇలా చేయడం వల్ల ఆ యాప్ నీ ఎవరు uninstall చేయకుండా ఈ rule పెట్టింది.
మొత్తం మీద… Sanchar Saathi అనేది మన వంటి mobile users కు నిజంగా lifesaver లాంటింది. ఒకసారి bookmark చేసుకుని ఉంచు. అవసరం వచ్చినప్పుడు చాలా ఉపయోగపడుతుంది!
Also Read: Whatsapp Sim Binding Update: ఇకపై ఆ సిమ్ లేకపోతే వాట్సాప్ పనిచేయదు కొత్త సెక్యూరిటీ రూల్ ఇదే!












1 thought on “Sanchar Saathi Portal అంటే ఏమిటి?—నీ ఫోన్ పోయినా 5 నిమిషాల్లో బ్లాక్ చేసేయ్!”