హాయ్ ఫ్రెండ్స్! మనలో చాలామందికి ఉదయం లేవగానే వాట్సాప్ చెక్ చేయడం అలవాటు కదా? కానీ, ఈ మధ్య కాలంలో జరుగుతున్న ఆన్లైన్ మోసాలు, వాట్సాప్ హ్యాకింగ్స్ చూస్తుంటే ఎక్కడ మన అకౌంట్ హ్యాక్ అవుతుందో అని ఒక చిన్న భయం అందరికీ ఉంటుంది. అయితే, ఇకపై ఆ టెన్షన్ పడాల్సిన పనిలేదు. మన ఇండియా యూజర్స్ సేఫ్టీ కోసం వాట్సాప్ ‘SIM Binding’ అనే ఒక అదిరిపోయే సెక్యూరిటీ ఫీచర్‌ను తీసుకురాబోతోంది.
అసలు ఏంటి ఈ ‘SIM Binding’?
సింపుల్ గా చెప్పాలంటే.. ఇది మీ వాట్సాప్ అకౌంట్‌కి, మీ ఫోన్ సిమ్ కార్డ్ (Mobile Number)కి వేసే ఒక “బలమైన డిజిటల్ లాక్”.
ప్రస్తుతం మన ఫోన్ లో వాట్సాప్ ఒకసారి లాగిన్ అయ్యాక, ఆ ఫోన్ నుండి సిమ్ తీసేసినా సరే వాట్సాప్ వైఫై మీద పనిచేస్తూనే ఉంటుంది. సరిగ్గా ఇక్కడే హ్యాకర్లు తమ చేతివాటం చూపిస్తున్నారు. కానీ, ఈ కొత్త ఫీచర్ వచ్చాక అలా కుదరదు!
- మీ ఫోన్ లో సిమ్ కార్డు Active గా ఉంటేనే వాట్సాప్ పనిచేస్తుంది.
- సిమ్ తీసేసిన మరుక్షణం వాట్సాప్ పని చేయడం ఆగిపోతుంది.
- ఎవరైనా వేరే డివైజ్ లో మీ నంబర్ తో లాగిన్ అవ్వాలని చూసినా, మీ సిమ్ వారి ఫోన్ లో ఉండదు కాబట్టి అది వెంటనే బ్లాక్ అవుతుంది.
మనకు ఎందుకు ఇది ఇంత ముఖ్యం?
భారతదేశంలో ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ వాడకం ఎంత పెరిగిందో, ఆన్లైన్ మోసాలు (SIM Swapping, OTP Scams) కూడా అంతే పెరిగాయి. మనకు తెలియకుండానే కాల్ ఫార్వార్డింగ్ చేసి ఓటీపీలు కొట్టేస్తున్నారు. టెక్ నిపుణుల ప్రకారం, ఈ SIM Binding వస్తే:
- హ్యాకింగ్ అసాధ్యం: మీ సిమ్ మీ ఫోన్ లోనే ఉంటుంది కాబట్టి, హ్యాకర్లు ఏమీ చేయలేరు.
- క్లోనింగ్ కి చెక్: మీ అకౌంట్ ని క్లోన్ చేయడం కుదరదు.
- బిజినెస్ అకౌంట్స్ కి సేఫ్టీ: ముఖ్యంగా బిజినెస్ నంబర్స్ వాడుతున్న వారికి ఇది పెద్ద రిలీఫ్.
ఎప్పుడు వస్తుంది?
ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశ (Beta Stage) లో ఉందని WABetaInfo రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఇంకో 1-2 నెలల్లో మనందరికీ ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
మొత్తానికి వాట్సాప్ తీసుకుంటున్న ఈ నిర్ణయం మన ఇండియా యూజర్స్ కి నిజంగా ఒక వరం అనే చెప్పాలి. ఇకపై స్కామర్స్ భయం లేకుండా వాట్సాప్ వాడుకోవచ్చు!
Also read : WhatsApp 2025 Update: కొత్త Chat Filters, HD Photos & UI Changes Android Users కోసం విడుదల












3 thoughts on “Whatsapp Sim Binding Update: ఇకపై ఆ సిమ్ లేకపోతే వాట్సాప్ పనిచేయదు కొత్త సెక్యూరిటీ రూల్ ఇదే!”