Phone Battery ఎందుకు ఇంత త్వరగా Drain అవుతుంది? 12 నిజమైన కారణాలు & Easy Fixes (2025 Guide)

ఈ రోజుల్లో smartphone ఎంత ఉన్నతమైనదైనా, battery తగ్గిపోతే మనకు బాధే.
“అయ్యో… ఇంకా ఉదయం నుంచే charge చేశా… ఇంతలోనే ఎందుకు ఇంత తక్కువైంది?”
అని మనలో చాలా మంది రోజూ అనుకుంటుంటారు. ఫోన్లో చార్జింగ్ అయిపోతాయి వాళ్ల ఆస్తి పోయినట్టు ఫీల్ అయిపోతారు చాలామంది. ఈ రోజుల్లో తినడానికి తిండి లేకపోయినా పర్లేదు గాని ఫోన్లో చార్జింగ్ మాత్రం ఉండాలి , just funny.

అసలేంటి, ఫోన్ battery ఇలా ఎందుకు drain అవుతుంది?
ఇదిగో చాలా మందికి తెలియని 12 అసలు కారణాలు, వాటిని తగ్గించడానికి మీరు వెంటనే చేయగల simple tips.


1️⃣ Brightness చాలా ఎక్కువగా పెట్టడం

అన్నింటిలో ఎక్కువ battery తినేది display ఇవే battery తగ్గిపోవడానికి కారణాలు.
Brightness ఎక్కువగా ఉంటే drain double అవుతుంది. ఎక్కువ brightness పెడితే కళ్ళకి కూడా ఒత్తిడి పడుతుంది, కాబట్టి తక్కువ పెట్టుకుంటే కళ్ళకి మంచిది అలానే బ్యాటరీ పెరుగుతుంది. ఇవే battery తగ్గిపోవడానికి కారణాలు.
👉 Tip: Auto brightness పెట్టేయండి. Indoor లో brightness తగ్గించండి.


2️⃣ Background లో apps nonstop గా run అవ్వడం

మనం back button నొక్కి బయటికి వచ్చామని అనుకుంటాం కానీ…
Apps actual గా close అవ్వవు. అవి బ్యాగ్రౌండ్ లో రన్ అవుతూ ఉంటాయి మనం జస్ట్ పాస్ చేస్తే అవి రీసెంట్ యాప్ లో ఉంటాయి మనం కంప్లీట్ గా క్లోజ్ చేస్తే బ్యాటరీ లైఫ్ కూడా పెరుగుతుంది.
👉 Tip: Background apps manually close చేయండి లేదా “Battery Optimization” ON చేయండి. ఎలా చేయడం వల్ల బ్యాటరీ లైఫ్ పెరుగుతుంది.


3️⃣ Location / GPS ఎప్పుడూ ON లో ఉండటం

Location hiddenగా battery తింటూ ఉంటుంది. లోకేషన్ అనగానే బ్యాక్ గ్రౌండ్లో 24/7 Run అవుతూనే ఉంటుంది. మీకు లొకేషన్ అవసరం అనిపిస్తే ఆన్ లో ఉంచుకోండి అవసరం లేదని అనిపిస్తే ఆఫ్ లో పెట్టుకుంటే మంచిది.

👉 Tip: Maps ఉపయోగించినప్పుడు మాత్రమే ON చేయండి.


4️⃣ Mobile Data వల్ల Battery ఎక్కువగా తగ్గిపోవడం

WiFi కంటే mobile data 2x battery వాడుతుంది. మొబైల్ డేటా అయినది మన మొబైల్ లో ఉండే చిప్ ని యూస్ చేసుకుంటుంది ప్రతి సెకండ్ అది టవర్ తో కమ్యూనికేషన్ అవుతూ ఉంటుంది అందుకే అది ఎక్కువ engery తీసుకుంటుంది వైఫై అలా కాదు డైరెక్ట్ గా Router నుండి తీసుకుంటుంది కాబట్టి అది తక్కువ engery తీసుకుంటుంది.

👉 Tip: WiFi ఉందంటే mobile data కంటే WiFi పైకి మారండి.


5️⃣ Hotspot ON ఉంచడం

Hotspot అసలు battery కిల్లర్. ఒక్క గంటలో 20–25% drain చేస్తుంది. మనకి అవసరం అనిపిస్తే ఆన్ చేసి ఉంచవచ్చు అవసరం లేదని మీకు కనిపిస్తే ఆఫ్ చేసుకోండి లేదంటే ఆటో టర్న్ ఆఫ్ ఉంటుంది అది Enable చేసుకుంటే ఎటువంటి device కనెక్ట్ కాకపోతే అది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది.

👉 Tip: Short time కోసం మాత్రమే వాడండి.


6️⃣ Heavy apps ఎక్కువగా వాడటం

Instagram, YouTube, BGMI లాంటి apps battery వేగంగా తింటాయి. మీకు అవసరంలేని యాప్స్ తీసేయండి, అవసరం అనుకుంటే ఉంచండి.

👉 Tip: Lite apps వాడండి. Gaming కు time limit పెట్టుకోండి.


7️⃣ Phone వేడెక్కిపోవడం

Phone heat అయితే battery కూడా వేగంగా తగ్గుతుంది. ఫోన్ వేడెక్కుతుంది అనిపిస్తే కొంతసేపు స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేయండి మీ సమస్య పరిష్కారం అవుతుంది.
👉 Tip: Charging సమయంలో ఫోన్ వాడొద్దు. Sunlight లో phone వాడటం avoid చేయండి.


8️⃣ Battery health తగ్గిపోవడం (2–3 years తర్వాత common)

Battery అనేది slowly health కోల్పోతుంది. అప్పుడు drain ఎక్కువ అవుతుంది. మీ బ్యాటరీ మెరుగుగా పని చేయాలంటే 20% నుండి 80% మధ్యన మైంటైన్ చేయండి, చార్జింగ్ 100% పెట్టవద్దు ఇది ఫాలో అవడం వల్ల మీ బ్యాటరీ లైఫ్ పెరుగుతుంది.

👉 Tip: Battery “Health” check చేయండి. అవసరమైతే replace చేయండి.


9️⃣ Network signal బలహీనంగా ఉండడం

Signal low గా ఉంటే phone అదనంగా network search చేస్తుంది → battery drain. మీకు కాల్స్ అప్పుడు రావు అనిపిస్తే flight mode లో పెట్టుకోవడం మంచిది.
👉 Tip: Signal weak అయితే flight mode పెట్టండి.


🔟 Live wallpaper, heavy themes

Fancy themes, animations battery unnecessarily వాడుకుంటాయి. సింపుల్ వాల్ పేపర్స్ పెట్టుకోండి. దీనివల్ల మీ బ్యాటరీ లైఫ్ పెరుగుతుంది ఎందుకంటే ఆ వాల్ పేపర్స్ మనం చూడము ఎందుకంటే వేరే యాప్ యూస్ చేస్తున్నప్పుడు ఆ వాల్ పేపర్స్ మనకు కనిపించదు దానివల్ల మనకు ఉపయోగం కూడా లేదు లైవ్ వాల్ పేపర్స్ వల్ల.
👉 Tip: Simple wallpaper + dark mode వాడండి.


1️⃣1️⃣ Notifications ఎక్కువగా ఉండటం

ప్రతి notification అంటే small background process. సెట్టింగ్స్లో మీకు అవసరం లేని ఆప్స్ యొక్క నోటిఫికేషన్ పెట్టుకోండి. దానివల్ల అవసరం లేని నోటిఫికేషన్ సౌండ్స్ కూడా మీకు విసిగించకుండా ఉంటుంది.
👉 Tip: అవసరం లేని apps కు notifications OFF.


1️⃣2️⃣ Malware / virus వల్ల hidden battery drain

Unknown apps లేదా unsafe websites వాడితే virus CPU & internet misuse చేస్తుంది. ప్లే స్టోర్లో తప్ప మిగిలిన అప్సెట్ లో ఎటువంటి యాప్స్ ఇన్స్టాల్ చేయకండి ఇది చాలా ప్రమాదం తర్వాత మీరే ఇబ్బందుల్లో పడతారు.
👉 Tip: Trusted antivirus scan చేయండి.


Battery drain తగ్గించడానికి Best 2025 Tips

  • Dark mode ఎప్పుడూ ON
  • 60Hz refresh rate sufficient (gaming కాకపోతే)
  • Unused apps uninstall చేయండి
  • Week లో ఒకసారి phone restart చేయండి
  • Charging సమయంలో phone వాడొద్దు
  • Fake chargers ఎప్పుడూ వాడొద్దు

ముగింపు

Phone battery drain అనేది చిన్న విషయం కాదు… కానీ చాలాసార్లు ఇది మన usage వల్లే జరుగుతుంది. మన మన మొబైల్ జాగ్రత్తగా ఉపయోగించుకుంటే మన బ్యాటరీ లైఫ్ కూడా రెండు నుండి ఐదు సంవత్సరాలు వస్తుంది. మనం చేసే ఈ చిన్న మార్పుల వల్ల మన మొబైల్ బ్యాటరీని చక్కగా మెయింటైన్ చేయగలం.
కొంచెం settings మార్చినా, కొన్ని small habits మార్చినా battery life నిజంగానే మరికొన్ని గంటలు పెరుగుతుంది.

Proper care ఇస్తే battery 2–3 years కు కూడా బాగా పనిచేస్తుంది.

Also Read: Phone Slow అవడానికి 10 కారణాలు & Fast చేయడానికి Tips (2025)

Leave a Comment