WhatsApp కొత్త ఫీచర్ – ఇక మెసేజ్ Edit చేయడానికి పూర్తి 1 గంట టైమ్!

WhatsApp users కోసం మరో మంచి WhatsApp edit time update రాబోతోంది. మనం మెసేజ్ పంపిన తర్వాత 15 నిమిషాల లోపే edit చేయగలిగేవాళ్లం కదా? చాలా సార్లు టైపో వస్తుంది, తర్వాత meaning మార్చాలనిపిస్తుంది, లేదా చిన్న వివరాలు add చేయాలి అనిపిస్తుంది… ఈ అన్ని పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, WhatsApp ఇప్పుడు editing time ను 1 గంటకు పెంచే ప్లాన్ లో ఉంది.
బీటా version వాడుతున్న కొందరికి ఇది ఇప్పటికే కనిపిస్తుంది.


👉 ఏమిటీ ఆ కొత్తగా వచ్చిన whatsapp edit time update?

ఈ update లో రెండు main changes ఉన్నాయి:

  • Message edit time: 15 minutes → 1 hour
  • Photos/videos captions కూడా edit చేయొచ్చు

ఇప్పటివరకు captions ఏదైనా miss అయ్యినా, spelling తప్పు వచ్చినా దాన్ని మార్చడానికి option లేకపోయింది. కొత్త update తర్వాత ఇది చాలా easy అవుతుంది. Fastగా పోస్టు చేసే వాళ్లకి ఇది big relief.


👉 ఎవరికీ ముందుగా వచ్చేది?

ఇప్పుడే ఈ feature అందుబాటులో ఉన్నది:

  • Android Beta users
  • iOS Beta users

stable version కే ఇది వచ్చే కొన్ని వారాల్లో నెమ్మదిగా rollout అయ్యే అవకాశం ఉంది. WhatsApp updates సాధారణంగా phase-wise గా వస్తాయి కాబట్టి అందరికి ఒకేసారి కనిపించకపోవచ్చు.


👉 ఈ feature ఎందుకు use అవుతుంది?

ఇది నిజంగా day-to-day usage కి చాలా helpful.
మనమందరం WhatsApp లో రోజుకు ఎన్నో మెసేజ్‌లు పెడతాం. కొన్ని లక్ష్యం లేకుండా rush లో పంపేస్తాం. ఒకసారి పంపాక 15 minutes లోపే గుర్తించడం కష్టమే.
ఇప్పుడు full 1 hour టైమ్ ఉన్నందున, తప్పులు సరిదిద్దుకోవడం, wording మార్చడం, context add చేయడం—all easy అవుతుంది. వాట్సాప్ లో message లు edit చేసే అలవాటు ఉన్నవాళ్ళకి ఈ feature చాలా బాగా ఉపయోగపడుతుంది.

నాకు తెలిసి ఈ update 100 లో 90 users కి ఉపయోగపడుతుంది మరి మీకు ?

మీకు ఏమైనా సందేహాలు ఉంటె ఒకేసారి Official సైట్ లో చుడండి


Source: WhatsApp Beta Changelog

1 thought on “WhatsApp కొత్త ఫీచర్ – ఇక మెసేజ్ Edit చేయడానికి పూర్తి 1 గంట టైమ్!”

Leave a Comment